Monday, 20 April 2026 05:26:02 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టిడిపి జనసేన కూటమిదే అంతిమ విజయం

Date : 04 February 2024 07:18 PM Views : 262

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపి - జనసేన కూటమిదే అంతిమ విజయం ఈసారి కందుకూరులో ఎగరబోయేది పసుపు జెండాయే రాబోయే ప్రభుత్వంలో అన్నివర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తా - ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరులో బాబుషూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కందుకూరు, అమరావతి జ్యోతి: జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎన్ని చోట్లకి మార్చి పంపినా ఉపయోగం లేదని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ఘన విజయం సాధించటం ఖాయమని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు పట్టణంలోని 21వ వార్డు కాళిదాసు వారి వీధి ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. నాగేశ్వరరావుతో పాటు పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ మినీ మేనిఫెస్టో లో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యే మీకు ఎప్పుడైనా కనిపించారా, మీ ప్రాంతాలకు వచ్చారా అని స్థానికులను అడిగారు. ఎన్నికలకు ముందు ఆయన ఇంటింటికి ఓట్ల కోసం తిరిగారని, తర్వాత ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు సమాధానం ఇచ్చారు. ఏదైనా సమస్యల గురించి స్థానిక నేతలను కలిసినా సరిగా సమాధానం చెప్పడం లేదని, పైగా ఇష్టం వచ్చినట్లు పింఛన్లు తీసేస్తున్నారని అనేకమంది మహిళలు వాపోయారు. చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక కోసం వేల రూపాయలు పెట్టాల్సి వస్తుందని, వైసిపి నాయకులు మాత్రం ప్రతిరోజు ట్రాక్టర్లలో తరలిస్తూ అమ్ముకుంటున్నారని అన్నారు. కరెంటు చార్జీలు విపరీతంగా పెంచేసి, అధికంగా వచ్చిన బిల్లులు సాకుగా చూపి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సైడ్ కాలవలలో పూడిక కూడా తీయకపోతుండడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఓట్ల కోసం అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఇళ్ల ముంగిటకు వస్తే నిలదీస్తామని కరాఖండిగా చెప్పారు. ఈ మాయదారి ప్రభుత్వంలో తమకు జరిగిన మేలు ఏమీ లేదని, దీనికంటే తెలుగుదేశం పాలనే బెటర్ గా ఉందని యువకులు అభిప్రాయపడ్డారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న అక్రమాలు కొన్ని మాత్రమే పైకి కనిపిస్తున్నాయని, ప్రజలకు తెలియకుండా అనేక దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు ఏమి చేయలేకపోయామన్న భయం వైసిపి నేతల్లో ఉందని, అందుకే వార్డుల్లో తిరగడానికి రావడం లేదని తెలిపారు. అరకొరగా మున్సిపాలిటీలో జరుగుతున్న పనులు కూడా క్వాలిటీ లేకుండా చేసి, పనులు పూర్తికాకుండానే బిల్లులు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రెవిన్యూ రికార్డులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు కోకొల్లలుగా ఉన్నాయని నాగేశ్వరరావు చెప్పారు. ఇలాంటి సమస్యలతో కందుకూరు ప్రజలు విసుగెత్తిపోయి మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కందుకూరులో భారీ తేడాతో వైసీపీని ఓడించి తీరుతామని, ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు పాకాల మల్లికార్జున, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, వార్డు నాయకులు దాసరి సుబ్బరాయుడు, చల్లా మురళీకృష్ణ, నాదెళ్ల మధుబాబు, గుమ్మ శివ, సంగ వంశీ, శ్రీకాంత్, నటరాజ్, జయరాం, మణికంఠ, నీలిశెట్టి సురేష్, పతకమురి వరప్రసాద్, చిలకపాటి తుఫాన్ బాబు, వంశీ, పసుపులేటి మహేష్, పాలెపు వెంకటేశ్వర్లు, మనోజ్ కుమార్, సుధీర్, సాయికిరణ్, సాకేత్, సాయి ప్రసాద్, రణధీర్, నాయకులు చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డెళ్ళ రవిచంద్ర, కల్లూరి వెంకటేశ్వర్లు, చుండూరి శ్రీనివాసులు, షేక్ సలాం, ముచ్చు వేణు, షేక్ రూబీ, సయ్యద్ గౌస్ బాషా, షేక్ ఫిరోజ్, సవిడిబోయిన వెంకటకృష్ణ, అత్తంటి శివకృష్ణ, కాకుమాని మాల్యాద్రి, ముప్పవరపు వేణు, అత్తంటి శివకృష్ణ, మచ్చ మనోహర్ , పిరతల బాలాజీ మరి ఇతర నాయకులు పాల్గొన్నారు...

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :