Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పునరావాస కేంద్రాలను పరిశీలించిన శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి. కందుకూరు, అమరావతి జ్యోతి,: తుఫాను ప్రభావంతో ముంపు గ్రామాల కోసం కందుకూరు ఏఎంసి కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా ఆహారము, మంచినీరు విద్యుత్ సౌకర్యంతో పాటు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏ చిన్న సమస్య వచ్చిన ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని అధికారులకు సూచించారు.
Admin
Amaravathi Jyothi