Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : కందుకూరు: కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సాగు నీటి సంఘాల ఎన్నికలు, నోటిఫికేషన్, నిర్వహాణ పై నాయకులతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పాలనలో సాగు నీటి వ్యవస్థ సర్వనాశనం చేశారని, వ్యవస్దలకు సరైన కేటాయింపులు లేక సాగు నీటి సరఫరా వ్యవస్దలును నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు.. సాగు నీటి వ్యవస్థకు పునర్జీవనం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు సంకల్పం మేరకు సాగు నీటి సంఘాలకు ఎన్నికలు జరుపుకుందామన్నారు..కావున అందరూ కస్టపడి అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు గెలవాలి నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..
Admin
Amaravathi Jyothi