Monday, 27 July 2026 12:40:11 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మా భూములను మాకు తెలియకుండా అధికారులు కౌలుకు ఇచ్చారంటూ రైతులు ఆందోళన

Date : 01 December 2023 07:38 AM Views : 502

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మా భూములను మాకు తెలియకుండానే అధికారులు కౌలుకు ఇచ్చారంటూ రైతులు ఆందోళన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తూ ప్రభుత్వ సొమ్ము దోపిడీ అక్రమ కౌలు కార్డులు జారీచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత పొన్నలూరు,అమరావతి జ్యోతి : అధికార వైసీపీ పార్టీ నాయకుల లీలలు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తుందని మండల టీడీపీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు ఆరోపించారు. మండలంలోని చెరుకురు రెవెన్యూ పరిధిలో భూ యజమానులకు తెలియకుండా రెవెన్యూ అధికారులు గుర్తు తెలియని వ్యక్తులకు కౌలు రైతు కార్డులు మంజూరు చేయడం పై గురువారం తహసీల్దార్ శ్రవణ్ కుమార్ కు పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద రైతుల కోసం అందించే సంక్షేమ పథకాలు అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని చెరుకూరు, ముండ్లమూరి వారిపాలెం, వెంకుపాలెం, పై రెడ్డిపాలెం, తిమ్మపాలెం, నాగిరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన రైతుల భూములు వారి ఆమోదం లేకుండానే రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కౌలు రైతు కార్డులు మంజూరు చేశారన్నారు. ఆ కౌలు రైతు కార్డులను అడ్డుపెట్టుకొని అక్రమార్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులతోపాటు, పంట నష్టం భీమా పొందారని తెలిపారు. వాస్తవానికి భూములు ఉండీ , కౌలు కి చేస్తూ కూడా రైతు భరోసా రాలేదని మండలంలోని పలు గ్రామాల రైతులు నిత్యం ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్న న్యాయం చేయలేదని వాపోతున్నారు. అలాంటిది ముక్కు మొఖం తెలియని వాళ్ళ ఖాతాల్లో ఇప్పటి వరకు సుమారుగా రూ. 3 కోట్ల మేర నగదు మళ్లించడం మండలంలో చర్చ కు దారితీసింది. ఈ అవినీతి కి సహకారాన్ని అందించిన రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులపై సమగ్రమైన విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అవినీతి తతంగం అంతా చెరుకురు రెవెన్యూ పరిధిలోని వైసీపీ కి చెందిన వ్యక్తి కీలకంగా మారి, అధికారులకు తాయిలాలు, నైవేద్యాలు ముట్టచెప్పి గుట్టు చప్పుడు కాకుండా నాలుగు ఏళ్లుగా నడిపించడం పై మండల ప్రజలు అవాక్కయ్యారు. ఏది ఏమైనా అన్ని అర్హతలు ఉండి సంక్షేమ పథకాలు అందక రైతులు విత్తనాలు రాక, ఎరువులు రాక నా నా అవస్థలు పడుతున్నా... అక్రమార్కులకు మాత్రం అన్ని గడప వద్దకే అందడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై తహశీల్దార్ శ్రవణ్ కుమార్ ని వివరణ కోరగా జరిగిన సంఘటన పూర్తిగా సచివాలయం పరిధిలో జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషు లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహశీల్దార్ కి ఫిర్యాదు చేసిన వారిలో నేలపాటి వెంకటేశ్వర్లు, తల్లపనేని మాధవ, మాజీ టీడీపీ అధ్యక్షులు మండవ ప్రసాద్, కర్ణా కోటిరెడ్డి, గుంటూరి సింగయ్య, పాల్గుడి సురేంద్ర, రైతు సంఘం అధ్యక్షులు కుంకు సురేష్ తోపాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: