Tuesday, 21 April 2026 01:51:31 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రోడ్డుపైనే బైటాయింపు వంట వార్పుతో అంగన్వాడీల నిరసన

Date : 20 December 2023 07:37 AM Views : 304

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : రోడ్డుపైనే బైఠాయింపు ఎనిమిదవ రోజు వంట --వార్పుతోఅంగన్వాడీల నిరసన వెలిగండ్ల, అమరావతి జ్యోతి : వెలిగండ్ల లోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు మంగళవారం 8వ రోజు వంటావార్పుతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటి నాయకులు జీవి కొండారెడ్డి మరియు మానవ హక్కుల కమిటీ చైర్మన్ ఎస్.కె గౌస్ బాషా, అలాగే సిఐటియు నాయకులు రాయల మాల కొండయ్య పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడుతూ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐ సి డి ఎస్ సేవలకు ఎనిమిది సార్లు భారత ప్రభుత్వం అవార్డులను తీసుకోవడం జరిగిందని అంగన్వాడీలు మాత్రం చాలీచాలని వేతనాలతోనే వారి యొక్క జీవన పరిస్థితులు నేటికీ మెరుగు పడలేదని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఐసిడిఎస్ కు 90% అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా పది శాతం నిధులతో బడ్జెట్లో విడుదల చేయడం జరిగేదని ఇప్పుడు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి శాతాన్ని దిగజార్చి ఐసిడిఎస్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా వేతనాలుపెంచుతామని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగామాట తప్పడం జరిగిందని అలాగే దుర్మార్గంగా అంగన్వాడి సెంటర్లో తాళాలు పగలగొట్టి భయభ్రాంతులకు చేయడం ఏమిటని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పోరాటాల ఉదృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు రఫియా, వెంకటలక్ష్మి, సలోమి, తిరుపతమ్మ, అనురాధ, సుధారాణి,ఆదిలక్ష్మి, నాగేంద్రమ్మ, పద్మావతి, రమాదేవి,శారదా, జాన్సీ, రాణి, ఈశ్వరమ్మ తదితరులు, పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :