Saturday, 15 August 2026 06:57:13 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అరాచక పాలనకు చరమ గీతం పాడదాం

Date : 20 February 2024 12:33 AM Views : 245

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావలిలో అరాచక పాలనకు చరమగీతం పాడుదాం - బంపర్ మెజారిటీ తో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం - *రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పిలుపు* కావలి అమరావతి జ్యోతి: కావలి నియోజకవర్గంలోని అరాచక పాలనకు చరమగీతం పాడుదామని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పేర్కొన్నారు... సోమవారం కావలి పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కావలిలో ఎమ్మెల్యే అరాచకాలు అరికట్టడానికి మాలేపాటి సుబ్బానాయుడు ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.. చంద్రబాబు ఒక్క పిలుపుతో తన సీట్ ను కూడా త్యాగం చేశారని అన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేసి కావ్య క్రిష్ణారెడ్డి ని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు... వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీశారని, వారిపై దాడులు చేశారన్నారు... కావలి నియోజకవర్గం లో తెలుగుదేశం నాయకులు 160 మంది పై అక్రమ కేసులు ఈ ప్రభుత్వం పెట్టడం జరిగిందని, అనేకమంది జైలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.. రాక్షసులు, దుర్మార్గులు, అవినీతిపరులతో మనం పోరాడుతున్నామని అన్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన దామవరం ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఆగిపోయిందని అన్నారు.. కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేసారని, అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేశారని, దళితులపై దాడులు చేశారని అన్నారు.. దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి అతని ఆత్మహత్య కు కారణం అయ్యారన్నారు.. రాష్ట్రంలోనే అత్యధిక అరాచకాలు కావలిలోనే జరుగుతున్నాయని, వాటన్నిటికీ చరమగీతం పాడాలంటే కావ్య కృష్ణారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు , ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు ,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ , నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ , ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఉదయగిరి టీడీపీ ఇంచార్జి, మాజీ శాసన సభ్యులు బొల్లినేని రామారావు, కందుకూరు టీడీపీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరరావు , నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి , కావలి నియోజకవర్గ పరిశీలకులు బొమ్మి సురేంద్ర, జిడిడి దివాకర్ , తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య , రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పొట్లూరు శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: