Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాలకొండ దేవస్థానం స్థాయి పెంపు. వివి పాలెం,అమరావతి జ్యోతి : శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన సహాయ కమిషనర్ గా పనిచేయుచున్న కె.బి.శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి పొందియున్నారు. మాలకొండ దేవస్థానం సహాయ కమిషనర్ స్థాయి నుండి డిప్యూటీ కమీషనర్ స్థాయి హోదా కు పెంపుదల చేయబడినందున, కె.బి.శ్రీనివాసరావుని మాలకొండ దేవస్థానమునకు, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా నియమించగా, భాధ్యతలు స్వీకరించియున్నారు.
Admin
Amaravathi Jyothi