Monday, 02 March 2026 12:14:54 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

18న వెంగమాంబ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం, భారీగా అన్నదానం ఏర్పాటు

Date : 16 January 2026 11:02 PM Views : 502

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కందుకూరు: ఈనెల 18వ తేదీన కందుకూరులో నిర్వహించబోయే స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలకు పెద్ద ఎత్తున తరలిరావాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి, ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర స్వర్గీయ ఎన్టీఆర్ దని పేర్కొన్నారు. సినీ రంగంలో కూడా రారాజుగా వెలుగొందారని, అందుకనే ఆయన్ను తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా ఇప్పటికీ భావిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ 30 వర్ధంతి వేడుకలను కందుకూరు పట్టణంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం, అక్కడి నుంచి వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఫంక్షన్ హాల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆపద సమయాల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రక్తం అవసరమవుతుంది కాబట్టి, నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల భాగస్వామ్యం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమం అనంతరం భారీ అన్నదానం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అన్నగారి అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, చిలకపాటి మధుబాబు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, షేక్ రూబీ, రాయపాటి శ్రీనివాసరావు, రవిచంద్ర, నరేంద్ర ముచ్చు శ్రీనివాసరావు, ఉన్నం వీరస్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :