Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పరామర్శించారు. నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. లక్ష్మీనాయుడు సతీమణి సుజాతను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్లో పరామర్శించారని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
Admin
Amaravathi Jyothi