Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మదీనా మసీదు లో ప్రార్థనల్లో పాల్గొన్న కావ్య క్రిష్ణారెడ్డి కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణంలోని వైకుంఠపురంలోని మదీనా మసీదులో నిర్వహించిన ప్రార్ధనల్లో కావలి అసెంబ్లీ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.. ఆయనకు మసీదు కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు.. ఎమ్మెల్యేగా గెలవాలని దువా చేశారు.. మసీదు అభివృద్ధికి రెండున్నర లక్షల విరాళం ప్రకటించారు.. ఈ సందర్భంగా కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం ఆరంభం కానుండటంతో ముందుగా ఈ శుక్రవారం ప్రార్ధనల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.. ముస్లింలకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, అలాగే మరో 10 ఎకరాల్లో స్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని తెలిపారు.. కావలి లో ప్రశాంత వాతావరణం లేదని, స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితులు లేవని అన్నారు.. భయం గుప్పిట్లో జీవిస్తున్న అందరికీ అండగా నిలబడతానని అన్నారు. ముస్లిం సోదరులను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానని, మీరందరూ సహకరించి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని, రాష్ట్రంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi