Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వలేటివారిపాలెం అమరావతి జ్యోతి : మండల కేంద్రం వలేటివారిపాలెం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి పురస్కరించి భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో పలు గ్రామాలకు చెందిన భక్తులు శివలింగాన్ని దర్శించుకుని అభిషేకాలు పూజలు నిర్వహించారు. మండలంలోని వలేటివారిపాలెం పోకూరు శాఖవరం కలవల్ల తదితర గ్రామాల్లోని శివ క్షేత్రాల్లో భక్తుల శివనామ స్మరణతో మారుమోగాయి. గ్రామంలోని యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
Admin
Amaravathi Jyothi