Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి.* కడియం, అమరావతి జ్యోతి : కడియం జిల్లా పరిషత్ పాఠశాలలో మండలంలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి లజపతిరాయ్ అధ్యక్షత వహించిగా ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మూఢనమ్మకాలను పారదోలాలని, మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం టీచర్ల విభాగంలో కడియపులంక ఉమెన్ ట్రాప్పింగ్ అనే అంశం, స్టూడెంట్, టీచర్ విభాగంలో జేగురుపాడు రోబోకు, టీచరు, ఇద్దరు స్టూడెంట్స్ విభాగంలో కడియం మస్కిటో బిన్ ప్రథమ స్థానాలు సాధించారు. ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో రాజమండ్రి బాలవిజ్ఞాన మందిరంలో జరిగే జిల్లా సైన్స్ ఫెయిర్ లో ప్రథమ స్థానం సాధించిన వారు పాల్గొనవలసి ఉంటుందని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా పాలశంకరం, భరద్వాజులు వ్యవహరించారు. అనుసంధానకర్తగా గొల్లపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. చక్కగా ప్రదర్శించిన విద్యార్థిననీ, విద్యార్థులను ఉపాధ్యాయులను ఈ సందర్భంగా పెద్దలు ప్రశంసించారు.
Admin
Amaravathi Jyothi