Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా రూ. యాబై వేలకు మించి నగదు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. ప్రార్థనా స్థలాలను ప్రచారానికి వాడటం,విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది.
Admin
Amaravathi Jyothi