Monday, 20 April 2026 06:58:05 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఫలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి

Date : 14 December 2024 06:24 AM Views : 861

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఫలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి రాళ్లపాడు కుడికాలువకు నీరు విడుదల లింగసముద్రం: గత మూడు రోజులుగా రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు మరమ్మత్తు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతటి విపత్తు కష్టమైన గేటు మరమ్మత్తు పనులు పూర్తిచేసి రైతులకు నీరు అందించాలనే ఎమ్మెల్యే ధృడ సంకల్పం ఫలించింది. అధికారులు, బయటి నుంచి వచ్చిన నిపుణుల బృందంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎట్టకేలకు శుక్రవారం మద్యాహ్నం నాటికి రాళ్లపాడు కుడి కాలువ గేటు మరమ్మత్తులు పూర్తయ్యాయి. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ప్రాజెక్టు వద్దకు వెళ్ళింది మొదలు ప్రతీ నిమిషం రైతుల నీటీ కోసమే ఎమ్మెల్యే ద్యాస సాగింది. పక్కనున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఇరువురూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. కష్ట సాధ్యమైన పనిని పూర్తి చేసిన నిపుణులకు, అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. రాళ్ళపాడు కుడి కాలువ ప్రాంత రైతులు ఆనందంగా పంటను వేయవచ్చని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. భగవంతుని దయతో ఈ ఏడాది వర్షాలు కురిసి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో సంపూర్ణంగా నిండాయని అన్నారు. మరోసారి అధికారులు, నిపుణుల బృందానికి అభినందనలు తెలిపారు. నాలుగు రోజులపాటు రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువకు నీరు విడుదల చేయడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :