Monday, 02 March 2026 12:20:37 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తొలిరోజే ''అన్నా'' కు అసమ్మతి సెగ

Date : 18 February 2024 09:37 AM Views : 1685

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : తొలిరోజే "అన్నా" రాకకు అసమ్మతి సెగ. - తర్లుపాడు లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం. - పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు గైర్హాజరు. - బయటపడ్డ వర్గపోర్లు. - బహిరంగంగా సర్పంచిని నెట్టివేసిన ఎంపీపీ. - తనను అవమానించారంటూ సమావేశం నుండి అలిగి వెళ్లిపోయిన సర్పంచ్ వర్గం. -- వైకాపాలో బీసీలకు ప్రాధాన్యత లేదంటూ విమర్శలు. తర్లుపాడు,అమరావతి జ్యోతి: గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం సమన్వయకర్త అయిన అన్నా వెంకట రాంబాబు రాక కి తర్లుపాడు మండలంలో "అసమ్మతి సెగ" తగిలింది. మండల కేంద్రమైన తర్లుపాడులో మండల స్థాయి నాయకుల,కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి స్వస్థలంలో ఏర్పాటు చేశారు. దీంతో తొలినుంచి "నిప్పు-ఉప్పు" లా ఉన్న ఎంపీపీ సూ రెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి - జడ్పిటిసి వెన్న ఇందిరా హనుమారెడ్డి మధ్య మరియు ఎంపీపీ పదవి ఆశించి విఫలమైన మాజీ జెడ్పిటిసి రావి భాషాపతి రెడ్డిలు మధ్య ఒక్కసారిగా వర్గ పోర్లు బయటపడ్డాయి. దీంతో జడ్పిటిసి వర్గం మరియు భాషాపతి రెడ్డి వర్గమైన కలుజువలపాడు ఎంపీటీసీ -1 సభ్యురాలు రావి రత్తమ్మ, కేతగుడిపి ఎంపీటీసీ సభ్యురాలు షారోన్, ఆ ఇరు వర్గాల కీలక నేతలు ఈ ఆత్మీయ సమావేశానికి గైర్హాజరయ్యారు. అంతేగాక తొలిసారి తర్లుపాడు మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి అన్నా రాంబాబు విచ్చేసిన సమయంలో స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చిన తుమ్మలచెరువు సర్పంచ్ షాజహాన్ రసూల్ ని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి బహిరంగంగా జనారణ్యంలో నెట్టివేయడంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనతో వచ్చిన 150 మంది కార్యకర్తలతో ఎంపీపీ తనను అవమానించారంటూ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. పలువురు నాయకులుబుజ్జగించేందుకు ప్రయత్నం చేసినా ససేమిరా అన్నట్లు సమాచారం.ఇందరి నాయకుల అసమ్మతి సెగతో తొలి రోజు తర్లుపాడు మండల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబుకి అప్పుడే ఒకింత బెంగ పట్టుకున్నట్లు సమాచారం. కీలక నేతల మధ్య వర్గ పోర్లు బయటపడటంతో ఓటర్ల పై ఈ ప్రభావం పడనున్నట్లు, పలువురు నాయకులు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో,బీసీ సర్పంచుల పట్ల, బీసీ నాయకుల పట్ల, చిన్న చూపు చూపారని, కీలక పదవులు గాని, కీలక బాధ్యతలు గాని, అప్పజెప్పలేదన్న విమర్శలు ఉన్నాయి.మరి ఈ నాయకులు మధ్య పోర్లను, ఈ కులాల మధ్య వివక్షతను " అన్నా రాంబాబు" అధికమిస్తారో లేక భంగపాటు కి గురవుతారో వేచి చూడాల్సిందే? ముందుగా ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన "అన్నా" కు నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. తర్లుపాడు లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, బస్టాండ్ సెంటర్ నందు గల కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని, ఒడిదుడుకులను, పోరాటపటిమలను కార్యకర్తలతో పంచుకున్నారు. కులమత బేధాలు లేకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, మార్కాపురం నియోజకవర్గం నుంచి ఈసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :