Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు --కోటపాటి జనార్దన్ రావు. .. కందుకూరు అమరావతి జ్యోతి: ఈ నూతన సంవత్సరం 2024.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, సరికొత్త విజయాలను అందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పారిశ్రామిక వేత్త కోటపాటి జనార్దన్ రావు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత తప్పులను సరిదిద్దుకోవడానికి, నూతన లక్ష్యాన్ని సాధించడానికి కొత్త సంవత్సరంతో మరో అవకాశం వచ్చిందన్నారు. కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. అవధుల్లేని సంతోషంతో 2024.. ప్రజల జీవితాల్లో గుర్తుండిపోవాలన్నారు. గతేడాదిలో జరిగిన మంచి కన్నా మరింత మేలు కలగాలని జనార్దన్ రావు ఆకాంక్షించారు. పాత చేదును మరచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి విజయం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.
Admin
Amaravathi Jyothi