Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు, అమరావతి జ్యోతి: సిపిఎం కందుకూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు, చేవూరు గ్రామ మాజీ సర్పంచ్ నూతలపాటి నరసింహం సంస్మరణ సభ గురువారం 10.30గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర రావు, మూలం రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య, మిరియం వెంకటేశ్వర్లు, ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. కామ్రేడ్ నరసింహం 1938లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.2024 ఆగస్టు 1తుది శ్వాస విడిచే వరకూ నిరంతర శ్రమ జీవి. ప్రజల మద్య జీవించి, ప్రజల కోసం, ప్రజల కొరకు, పోరాడిన మహనీయుడు కామ్రేడ్ నరసింహం . బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలకు సేవలు అందించారో, మరణం తర్వాత కూడా, తన ప్రార్ధివ దేహాన్ని ఒంగోలు మెడికల్ కాలేజీకి దానం చేసి, ఎంతో మంది వైద్య విద్యార్థులకు ప్రయోగశాలగా ఉపయోగ పడ్డారని, సిపిఎం పేర్కొంది.చేవూరు గ్రామ దళిత కౌలు రైతుల పోరాటం ఆయన జీవితంలో మరువ లేనిది. దళితులకు భూమి లేని కారణంగా, రైతుల భూమిని కౌలుకు తీసుకొని కుటుంబ పోషణ జరుపు కుంటారు. పంట చేతికి రాక, కౌలు కట్ట లేక, నరక యాతన అనుభవిస్తున్న దళితులను, వ్యవసాయ కార్మిక సంఘంలో చేర్చి, జిల్లా కమిటీ సహకారంతో, కౌలు రైతుల పోరాటం నిర్వ హించారు. తెట్టు బ్యాంకు, రుణాలు ఇచ్చేందుకు అంగీకరించక పోతే , బ్యాంకు మూసి వేసి, లావాదేవీలు స్తంభించిన అనంతరం, మేనేజ్మెంట్ దిగివచ్చి కవులు రైతులకు రుణాలు ఇచ్చిన రుణాలు ఇచ్చిన చరిత్ర చేవూరు నుండే ప్రారంభం. ఇందులో కామ్రేడ్ నరసింహం కీలకపాత్ర వహించారు. ఆయన ఆశయ సాధన కోసం చేవూరు గ్రామంలో ఆగస్టు 15వ తేదీన సంస్కరణ సభ జరుగుతోంది ఈ సంస్కరణ సభలో ప్రజలు ప్రజాతంత్రవాధులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆ కుటుంబ సభ్యులు కోరారు.
Admin
Amaravathi Jyothi