Monday, 20 April 2026 11:45:38 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఘనంగా పోతురాజు స్వామి పొంగళ్ళు కార్యక్రమం

Date : 31 December 2023 09:40 PM Views : 228

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఘనంగా పోతురాజు స్వామి పొంగళ్ళు కార్యక్రమం. కందుకూరు అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలోని పోతురాజు స్వామి గుడి వద్ద నెల పొంగళ్ళు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల వారసత్వ ధర్మకర్త దివి లింగయ్య నాయుడు పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్ధానిక ముత్తరాశిపాలెం ఆచార దేవర ఇంటి నుండి భోణం పొంగళ్ళు పెట్టి అక్కడ నుండి ఊరేగింపు నిర్వహించి పోతురాజు స్వామికి పొంగళ్ళు చెల్లించారు. ప్రజలు ప్రతీ ఇంట వారులు పోస్తూ పోతురాజుస్వామి వారి భోణం ఊరేగింపును జయప్రదం చేసారు. గ్రామ పోతురాజు, పోతురాజుస్వామికి చేసిన కత్తి సేవ, విద్యావంతులు చెప్పిన పోతురాజు స్వామి కధను భక్తులు ఆశక్తిగా తిలకించారు. దీవెన బండారు అనంతరం భక్తులు తీర్ధప్రసాదాలు స్వీకరించారు. పోతురాజు స్వామి ఆచార కార్యక్రమాలను సమర్ధవంతంగా చేసిన విధ్యావస్తుడు గొట్టిముక్కల గోవర్ధన్, కన్నమనీడు పల్నాటి చెన్నయ్య, రాధయ్య, పూజారులు మాల్యాద్రి, రామరాజు, గ్రామ పోతురాజు లకు దివి లింగయ్య నాయకుడు, పిడికిటి వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించారు. పోతురాజు స్వామి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న చికెన్ సెంటర్ సురేష్ రెడ్డి కి నిర్వాహక కమిటీ సత్కరించింది. కార్యక్రమంలో మాదాల మాల్యాద్రి, మంగపాటి కృష్టయ్య, పల్నాటి వీరుల ఆచారస్తులు చక్కా వెంకట కేశవరావు, చక్కా చెన్నకేశవరావు (శ్రీ లక్ష్మీ వాచ్), చక్కా సుబ్రహ్మణ్యం, మోసంగి ప్రసాద్, పిన్నంరాజు ప్రభాకర్, తొట్టెంపూడి వేణు, తల్లపనేని నరసింగరావు, బత్తిన కోటేశ్వరరావు, దామా మల్లేశ్వరరావు, మంగపాటి శ్రీను, మందలపు మాలకొండయ్య, మందలపు సుబ్బారావు, మంగపాటి శ్రీను, దావులూరి శేషమ్మ, గర్రం మల్లిఖార్జున, గుండవరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :