Saturday, 18 April 2026 02:17:57 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడం పిరికిపంద చర్య

Date : 18 February 2024 10:38 AM Views : 256

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : "*రాజధాని ఫైల్స్" సినిమా ప్రదర్శన అడ్డుకోవడం పిరికిపంద చర్య* - *సినిమాచూస్తే ప్రజలు ఛీ కొడతారని జగన్ రెడ్డి కి భయం* - *కావలి తెలుగుదేశం నేతలు వెల్లడి* కావలి అమరాజు జ్యోతి : రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన అడ్డుకోవడం పిరికిపంద చర్య అని కావలి తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు.. శనివారం కావలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డిఆదేశాల మేరకు ముసునూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు పేరుతో డ్రామాలు ఆడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు..వేల మంది రైతులను రోడ్డున పడేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.. సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా చేస్తే తప్పెలా అవుతుంది అని ప్రశ్నించారు. మీరు చేసిందే కదా వారు చూపించింది, దానికి ఉలుకెందుకని అన్నారు. మొన్నటి వరకు మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంటున్నారు.రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని, ఐదేళ్ల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మల్లించేందుకు ఇంకెన్ని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సినిమాలో ఎవరినీ కించపరిచే సన్నివేశాలు లేవని, కేవలం రాజధాని రైతులు ఆవేదన మాత్రమే చూపించే ప్రయత్నం చేశారన్నారు దానికే తాడేపల్లి ప్యాలెస్ వణికి పోతుందన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే తనను ప్రజలు ఎక్కడ చీకొడతారో అని జగన్ రెడ్డి భయపడ్డారని, అందుకే ఇలా దిగజారుడు చర్యలకు దిగారని అన్నారు. సినీ ప్రదర్శనను అడ్డుకున్న జగన్ రెడ్డి ఐదేళ్ల తన చెత్త పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆపగలరా? అని ప్రశ్నించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అని తెలుగుదేశం జనసేన కూటమి గెలవడం తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి తటవర్తి వాసు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :