Friday, 17 April 2026 02:54:23 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఖాయం :కావ్య కృష్ణారెడ్డి

Date : 10 March 2024 09:49 PM Views : 241

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి ప్రభుత్వం ఖాయం - కావలి అసెంబ్లీ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి కావలి,అమరావతి జ్యోతి: తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కలయికతో రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ల ప్రభుత్వం ఏర్పడనుందని కావలి తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి గారు పేర్కొన్నారు. ఆదివారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపిల కలయిక చారిత్రాత్మకమైనదని, తెలుగుదేశం - జనసేన- బిజెపిల కూటమిని పార్టీ సభ్యులుగా మేమందరం స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనను తుద ముట్టించేందుకు బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఈ ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు వంటిదని, మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా మరోసారి ఇది రుజువైందన్నారు. ఇంతటి అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని, తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలకు కూడా నమ్మకం కలిగిందని, అందుకే కేంద్రమే పొత్తులకు ఆహ్వానించిందని తెలిపారు. తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహా యజ్ఞానికి ఇటు జనసేనతో పాటు బిజెపి కూడా కలిసి వస్తుందన్నారు. నారా చంద్రబాబునాయుడు గారి దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉంటుందని, అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, 35 మాజీ కౌన్సిలర్ కొమర రమణయ్య, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివ, జనసేన కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్, గుంజి ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :