Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పెద్దపవనిలో బ్రహ్మరథం లింగసముధ్రం,అమరావతి జ్యోతి: పెదపవని గ్రామంలో మంగళవారం రాత్రి అదిరిపోయే రేంజ్ లో జరిగిన కందుకూరు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం.... INR కు గుమ్మడికాయలతో దిష్టి తీసి... మహిళల హారతులు ఇస్తూ... పూలవర్షం కురిపిస్తూ... మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా... విజయోత్సవాన్ని తలపించేలా సందడిగా మారిన పెదపవని వీధులు... నాగేశ్వరరావు కి దీవెనలు, శుభాశీస్సులు అందిస్తూ.. ఈసారి గెలిచేది నువ్వేనయ్యా అంటూ ఆశీర్వాదాలు అందజేసిన గ్రామస్తులు... గ్రామంలో వైసిపి ముఖ్య నాయకుడు రామిశెట్టి మాలకొండయ్యతో పాటు ఆయన ఆధ్వర్యంలో వివిధ వర్గాల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ లోకి చేరికలు.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించిన ఇంటూరి నాగేశ్వరరావు ..ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే... ఈసారి పెదపవని గ్రామంలో టిడిపికి భారీ మెజారిటీ ఖాయమని స్థానికులు చర్చించుకుంటున్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గొర్రెపాటి సాంబయ్య, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శి పూరిమెట్ల మాల్యాద్రి, జనసేన నాయకులు డేగల దొరస్వామి నాయుడు, మలిశెట్టి మనోహర్, మాజీ ఎంపీటీసీ కొండలరావు, పార్టీ నాయకులు రాఘవేంద్ర, కరీముల్లా, హిదయతుల్లా నారిశెట్టి వెంకటేశ్వర్లు చావా నరసయ్య, మలిశెట్టి మాల్యాద్రి, నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ నరసింహారావు, మండల స్థాయి నాయకులు, గ్రామ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi