Monday, 20 April 2026 05:30:30 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సమస్యలు పరిష్కరించమంటే బలవంతంగా తాళాలు పగలగొట్టడం ఏమిటని. అంగన్వాడీల ఆందోళన

Date : 17 December 2023 06:58 AM Views : 211

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ,సమస్యలు పరిష్కరించమంటే బలవంతంగా తాళాలు పగలగొట్టడం ఏమిటని అంగన్వాడీల ఆందోళన వెలిగండ్ల, అమరావతి జ్యోతి : అంగన్వాడి వెలిగండ్ల ప్రాజెక్టు కార్యాలయం నందు ఐదవరోజు ప్రాజెక్టు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె కొనసాగించడం జరిగినది. ముందుగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి అకాల మరణానికి సంతాపంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సభ్యులు ఓ సూరి బాల గురవమ్మ షాబ్జి చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తపరచడం జరిగినది. ఈ సంతాప సభకు ముఖ్యఅతిథిగా యుటిఎఫ్ సీనియర్ లీడర్ మరియు జిల్లా జన విజ్ఞాన వేదిక కన్వీనర్ మాలకొండ రెడ్డి హాజరై మాట్లాడుతూ, సాబ్జి విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో కార్మికులకు, ఉద్యోగులకు ముందుండి నడిపించిన వ్యక్తి అని వారు అకాల మరణం కార్మిక లోకానికి తీరనిలోటని అన్నారు. న్యాయమైన డిమాండ్ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ పెంచుతామన్న జీతాల కోసం అడుగుతూ ఉంటే బలవంతంగా దౌర్జన్యంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను బెదిరించి సెంటర్లను బలవంతంగా తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్య అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వెంటనే ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ర్యాలీగా వెళ్లి అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలగొట్టి రికార్డులను తారు మార్చేస్తున్నారని వీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో హోంగార్డు కరీముల్లా కు వినతిపత్రం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు రాయల మాలకొండయ్య, అంగన్వాడి యూనియన్ నాయకులు సోము వెంకట శ్రీలక్ష్మి, సలోమి,తిరుపతమ్మ నాగేంద్రమ్మ ఆదిలక్ష్మి మరియమ్మ, అరుణ, నారాయణమ్మ, సత్యవతి,మల్లేశ్వరి తదితర అంగన్వాడీలు పాల్గొనడం జరిగింది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :