Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మీ ఆదరాభిమానాలకు ధన్యవాదములు ఎం ఎల్ ఏ మహిదర్ రెడ్డి. కందుకూరు అమరావతి జ్యోతి: మానుగుంట కుటుంబంపై నియోజకవర్గ ప్రజలు విశేషమైన ఆదరాభిమానాలను చూపుతున్నందుకు తమ కుటుంబ సభ్యులందరు ధన్యవాదములు తెల్పుతున్నారని, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. బుధవారం తన తండ్రి స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా, వేలాది మంది అభిమానులు తమ స్వగ్రామానికి విచ్చేసి, తన తండ్రి విగ్రహానికి అవ్యాజ్యమైన ప్రేమతో, నివాళులర్పించడం నిజంగా మా తండ్రి యొక్క కార్యదక్షతకు, ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమని, స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి మృతి చెంది మూడున్నర దశాబ్దం దాటిన, ఆయనపై జ్వాజ్వల్యమానమైన అభిమానాన్ని చూపుతున్న అశేష ప్రజానీకానికి, వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి తన తండ్రి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన తమ కుటుంబ శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi