Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తు టంగుటూరు,అమరావతి జ్యోతి : చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదని మండలానికి చెందిన నిడమానూరు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన వల్ల తాము ఎంతో నష్టపోయామని అందువల్లే బోడపాటి అంజిబాబు నేతృత్వంలో సుమారు 20 కుటుంబాల వారు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు. పార్టీ లో చేరిన కొండపి శాసనసభ్యులు డా డోల శ్రీ బాల వీరంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కండువాలు కప్పి తెలుగుదేశం లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరారు. దామాచ8సత్య మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జేనసేన బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు తెదేపా మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi