Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : స్వావలంబన సాధించాలంటే ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలి ఎంపీడీవో వెంకటేశ్వరరావు గుడ్లూరు : పంచాయతీలలో స్వావలంబన సాధించాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో వెంకటరావు అన్నారు. రెండో రోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులను ఈ శిక్షణ తరగతులకు ఆహ్వానించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనిని అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ లకు, మండల స్థాయి అధికారుకు, పంచాయతీ కార్యదర్శులకు, వెల్ఫేర్, మహిళా పోలీస్, ఇంజనీర్, ఎనర్జీ సహాయకులకు, ఏ ఎన్ ఎం లకి సుస్థిరభివృద్ధి లక్ష్యాలపై రెండోరోజు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసారు. 4వ తేదీన శిక్షణ పొందిన అధికారులు వీరికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శంకర్ ,శ్రీనివాసులు, , ఏపీఎం చిన్నబాబు, సి హెచ్ ఓ భాస్కర్, పొట్లూరు, అడవిరాజుపాలెం పంచాయతీ కార్యదర్శులు లక్ష్మీ లత, శ్రీనివాసులు ట్రైనర్లుగా వ్యవహరించారు. , ఏపీవో అబ్దుల్, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ ఎంఈఓ గోవర్ధన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాగర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ కామేశ్వరి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi