Amaravathi Jyothi - Andhra Pradesh / Sir Balji Dist : కందుకూరు: కందుకూరు గ్రామ దేవత ఆదిపరాశక్తి శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయ మొదటిదశ నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేసుకుంది. రెండవ దశ అనివేటి మండపం నిర్మాణానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ఆదివారం కందుకూరు వాస్తవ్యులు దామా లక్ష్మీనారాయణ ధర్మపత్ని సుజాత రూ 10116 /-మరియు దామా వెంకట సాయి నరేంద్ర ధర్మపత్ని ప్రవల్లిక రూ 2116/-లు ఇచ్చారు.ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు.ఈ సందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి సహకరించిన భక్తులకు వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi