Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: కందుకూరులోని జనార్ధనకాలనీ పి హెచ్ సి కార్యక్రమం పల్స్ పోలియో సందర్భంగా కందుకూరు పట్టణంలోని జనార్ధన కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అప్పుడే పుట్టిన చిన్నారుల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కోరారు. తల్లిదండ్రులు మరచిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజం కోసం సహకరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అంతకుముందు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిహెచ్ఓ రమేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు డాక్టర్ బ్యూ గ్రేస్, డాక్టర్ స్టెల్లా కారుణ్య, పీహెచ్ఎన్ ఐ పద్మావతి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, వార్డు అధ్యక్షులు షేక్ నాగూర్, పొడపాటి మాధవ, పువ్వాడి కోటయ్య, పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, కూనం నరేంద్ర గడ్డం మాలకొండయ్య, గుర్రం మధు, ముచ్చు వేణు, పులి నాగరాజు, చుండూరి శ్రీను, షేక్ కాలేషా, యర్ర ముసలయ్య, దనేకుల ప్రసాద్, మేడ మల్లికార్జున, మురారిశెట్టి వెంకట సుధీర్, గుమ్మ శివ, మరియు పట్టణంలోని అన్ని వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi