Sunday, 19 April 2026 03:24:52 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జగనన్నా... నీ హామీలు ఏమయ్యాయి?

Date : 28 April 2024 05:13 PM Views : 719

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జగనన్నా... నీ హామీలు ఏమయ్యాయి ? కందుకూరుకు 80కోట్లు ఇస్తానని 20నెలల క్రితం చెప్పావ్ ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వకపోవడం మోసం కాదా ? మళ్లీ ఏం మొహం పెట్టుకుని ఓట్ల కోసం వస్తున్నావ్ ? ఇంటింటి ప్రచారంలో ఇంటూరి సౌజన్య కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు ప్రజలను మళ్లీ మోసం చేయడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కందుకూరు వస్తున్నారని ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య విమర్శించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కందుకూరు పట్టణంలోని 15 వ వార్డు ఖాజీపాలెంలో ఆదివారం ఉదయం ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. సౌజన్య మాట్లాడుతూ 20 నెల క్రితం రామాయపట్నం పోర్టు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కందుకూరు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారని అన్నారు. కందుకూరు పట్టణానికి బైపాస్ రోడ్డు, రాళ్లపాడు ఎడమకాలువ, మున్సిపాలిటీలో మౌలిక వసతుల కోసం దాదాపు 80 కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేయడమే జగన్ నైజం అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇవన్నీ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని సౌజన్య సూచించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు షేక్ ఖలీల్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా,వార్డు అధ్యక్షుడు షేక్ ఖలీల్, స్థానిక నాయకులు షేక్ జమీల్ అహ్మద్, షకీల్, అబ్దుల్ రహిమాన్, సుబహాని, రబ్బాని, అమిరుల్లా, గయాజ్, బాసీద్, బషీర్, హాజీ, రజాక్, జిలాని, రసూల్, గౌస్ బాషా, ఫయాజ్, వలి, రియాజ్, మహబూబ్ బాష, రియాజ్, రూబి, వడ్లమూడి చెంచునారాయణ, తొట్టెంపూడి రమణయ్య, మల్లవరపు వేణు, సంగా పాండురంగారావు, పట్టణ మహిళా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరి శైలజ, పట్టణ కమిటీ మహిళలు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :