Monday, 02 March 2026 12:18:59 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గుడ్లూరులో ఎమ్మెల్యే సతీమణి ఇంటూరి సౌజన్యకు ఘనసన్మానం

ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్లకు చైల్డ్ కేర్ సెలవులు మంజూరు అయ్యే విధంగా కృషి చేయాలని వినతి

Date : 18 November 2025 11:20 AM Views : 187

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య మండల కేంద్రమైన గుడ్లూరు లోని ఓ వేడుకకు హాజరై అమరావతి జ్యోతి ఎడిటర్ గుర్రం ఆదినారాయణ ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న మండలంలోని అభ్యుదయ హైస్కూల్ (ప్రైవేట్ స్కూల్) కి చెందిన ఉపాధ్యాయినిలు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు జొన్నలగడ్డ రమణమ్మ ఆధ్వర్యంలో జొన్నలగడ్డ జ్యోతి, అద్దంకి రాజేశ్వరి, కర్పూరపు పావని అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి ఇంటూరి సౌజన్యతో మాటా మంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సౌజన్య ప్రశ్నించడంతో ఆ ఉపాధ్యాయునిలు తమ సమస్యను విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం హర్షించదగ్గ విషయంమన్నారు .ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలలకు ఒకే విధమైన విధానాలు అమలు చేస్తుండడం హర్షించదగ్గ విషయం. పండగ సెలవులు ఒకే విధంగా నిర్వహించడం, రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించడం గాని తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ అందజేయడం ఇటువంటి అన్ని విషయాలలో ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఒకే విధమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. కానీ మహిళా ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన చైల్డ్ కేర్ సెలవులు విషయంలో మాత్రం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిలకు ఆ నిబంధనలు అమలు చేయడంలేదు. ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీలకు కూడా ఈ నిబంధన అమలు చేసినట్లయితే ఎంతోమంది ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిలకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే ద్వారా తమ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి మహిళా ఉపాధ్యాయినిలకు ప్రయోజనం కలిగించేలా చూడాలని వారు కోరారు. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజా సమస్యలపై ఇంటూరి నాగేశ్వరరావు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సౌజన్య ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి, ఇంటూరి సౌజన్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆమె వెంట జిల్లా టెలికాంబోర్డు డైరెక్టర్ గుర్రం మాల్యాద్రి సతీమణి గుర్రం రాజ్యలక్ష్మి, అబ్బూరి చందు తదితరులు ఉన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :