Monday, 20 April 2026 06:53:44 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు కాకర్ల ఘన సన్మానం

Date : 11 March 2024 10:36 PM Views : 296

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి కాకర్ల ఘన సన్మానం. టిడిపి జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం పట్ల కాకర్ల హర్షం.. రాజకీయ అనుభవాన్ని జోడించి ముందుకు నడిపించాలని కోరిన కాకర్ల సురేష్. నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందర ధ్యేయం. నియోజకవర్గ టిడిపి ఆత్మీయ సమావేశంలో బొల్లినేని వెంకట రామారావు. నెల్లూరు,అమరావతి జ్యోతి: ఉదయగిరి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారిని నెల్లూరులోని అతిధి గ్రౌండ్ హోటల్ నందు సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ అనుభవాన్ని జోడించి నన్ను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్ లు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు జాతీయస్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల్లో ఆనందం వెల్లువెరిసింది. నాయకులందరూ బొల్లినేని వెంకట రామారావు గారికి శుభాకాంక్షలు తెలియజేసి బొకేలు అందజేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను తూశ తప్పకుండా పాటించాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గౌరవస్థానం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేయాలని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం లో కాకర్ల సురేష్ గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఎన్నికల వ్యూహాన్ని నాయకులు రచించాలన్నారు. వైసిపి పార్టీని తుధ ముట్టించేందుకు టిడిపి కార్యకర్తలు నాయకులు కంకణ బదులుగా ఉండాలన్నారు. లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందన్నారు. కనుక విభేదాలను పక్కనపెట్టి విజయం సాధించి గిరిపై తెలుగుదేశం జెండాను ఎగరవేసి నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పొన్ను బోయిన బాబు యాదవ్ మాజీ ఏఎంసి చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ సీమకుర్తి రవీంద్రబాబు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దంతులూరు వెంకటేశ్వరరావు యారం కృష్ణయ్య కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం ఉదయగిరి కన్వీనర్ బయన్న వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి కోడూరు నాగిరెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :