Monday, 20 April 2026 06:59:07 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Date : 22 October 2024 09:59 PM Views : 847

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచన కందుకూరు: కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీ సర్వే పేరిట ఒక రైతు పొలం ఇంకొకరికి ఆన్లైన్ చేయడం, పొలం కొలతల్లో మార్పులు వంటి సమస్యల ద్వారా రైతుల్లో గందరగోళం నెలకొందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సమస్య పరిష్కారం దిశగా ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించే గ్రామ సభలలో అధికారులు అందరూ పాల్గొని సభల ద్వారా వచ్చిన అర్జీలను త్వరగతిన పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఇద్దరు రైతులు ఒకే సర్వే నెంబర్ తో అసైన్మెంట్ భూమిని కలిగి ఉన్నచో రెవెన్యూ రికార్డులను సక్రమంగా పరిశీలించి నిజమైన భూ హక్కుదారులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.. అన్ని మండలాలలో అసైన్మెంట్ భూముల సంబంధించిన రిజిస్టర్లు ఈనెల చివరికల్లా మండల రెవెన్యూ కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సబ్ కలెక్టర్ ని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో అయిదు మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :