Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైభవంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ. కందుకూరు అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలోని స్థానిక పామూరు రోడ్డులో గల బి.అర్ ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రాత్రి పదవ తరగతి వీడ్కోలు సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేటర్ శంకర్ విచ్చేసి విద్యార్థినీ విద్యార్థులకు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు , కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కరరావు, బి నరేంద్రబాబు, పాఠశాల డీన్ రామారావు, ప్రిన్సిపాల్ మల్లికార్జున, నజీర్, సునీత తదితర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi