Sunday, 26 July 2026 12:31:16 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

బాబు ష్యూరిటిలో బాదుడు గ్యారెంటీ : మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్

Date : 02 December 2024 06:31 AM Views : 905

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బాబు ష్యూరిటీలో బాదుడు గ్యారెంటీ బాసూ... మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన క్రమంలో వైకాపా కందుకూరు నియోజక వర్గం ఇన్చార్జి, కనిగిరి తాజా మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేయటం జరిగింది.ఎన్నికలకు ముందు చార్జీలు పెంచనని ప్రజలకు వాగ్దానం చేసి అధికారం లోకి వచ్చాక ఆ హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు ఆరు నెలల్లో వరుసగా రెండుసార్లు ట్రూప్ ఆప్ చార్జీల పేరిట వడ్డన చేసారు.రెండోసారి 9412 కోట్లు కరెంటు చార్జీల పెంచి ప్రజల పైన ఈ ఆరు నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల మేరకు భారం మోపారు. ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అనేది ప్రతి ఒక్కరికీ తెలిసినప్పటికీ ఎన్నికల సమయం లో ఇచ్చిన మోస పూరితమైన హామీలతో అధికారం చేపట్టగానే బాదుడే బాదుడు మొదలు పెట్టిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వం అని ఆయన అన్నారు.సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు మరోసారి తన మార్కు నయవంచనతో తాను ఇచ్చిన హామీలను తూట్లు పొడుస్తూ మరోసారి ప్రజల నడ్డి విరిచాడు. ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన బాబు షూరిటీ ఏమో గాని ప్రజలకు బాదుడు గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి తయారయింది. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ఊరువాడ ప్రచారం చేశారు.విద్యుత్ చార్జీలు పెంచబోమని ట్రూప్ చార్జీలు కూడా ఎత్తేస్తామని నాడు బీరాలు పోయిన బాబు తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఇప్పుడు నిస్సిగ్గుగా బుకాయిస్తూ ఉన్నారని యాదవ్ ధ్వజమెత్తారు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఎడా పెడా చార్జీలతో వీరబాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రెండోసారి ట్రూఫ్ ఆఫ్ చార్జీల భారం మోపారు.తాజాగా 9412.50 కోట్ల ఇందన సద్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది అని దీని ద్వారా ప్రతి యూనిట్ 0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచే అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది అన్నారు.ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీపావళి పండగకే రాష్ట్ర ప్రజలపై 6072.86 కోట్ల భారం వేసింది. ఆ చార్జీలను యూనిట్ కు 1.27 చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీల కలిపి జనవరి నుంచి యూనిట్ కి రూ 2.19 అదనంగా వినియోగ దారులు చెల్లించాల్సి వస్తుందని మధు సూధన్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అవసరమైతే గతంలో పెంచినవి కూడా తగ్గిస్తామని చెప్పాడు.ఎన్నికలకు ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు హామీ ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అవసరమైతే గతంలో పెంచినవి కూడా తగ్గిస్తామని చెప్పాడు. ఊరు వాడ కాలికి బలపం కట్టుకుని ఇదే చెప్పాడు.పులివెందుల కడప టిడిపి మహానాడు లోనూ ,ఆగస్టులో కార్యకర్తలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లోను, పెద్దాపురంలోనూ, వైజాగ్ రీజనల్ డాక్యుమెంట్ విడుదల సమయంలోనూ ఇదే విషయం పదే పదే చెప్పి ఇప్పుడు మాట తప్పు తున్నారని ఆయన అన్నారు. అందుకే తాము ప్రజలకు చెబుతున్న విషయం ఏమిటి అంటే బాబు ష్యూరిటి వీరబాదుడు గ్యారెంటీ అని. ప్రజలపై మోపే అదనపు విద్యుత్ భారాన్ని వెంటనే తగ్గించాలని ఈ ప్రకటనలో యాదవ్ డిమాండ్ చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: