Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : రాష్ట్ర యాదవ కార్పొరేషన్ మెంబర్ గా జనిగర్ల నాగరాజు కష్టానికి తగ్గ ప్రతిఫలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నాయకులు లోకేష్ కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపిన జనిగర్ల నాగరాజు. అమరావతి, అమరావతి జ్యోతి: నామినేటెడ్ పోస్టుల నియామకంలో భాగంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాలుగు కార్పొరేషన్లకు మెంబర్లను నియమించింది. యాదవ, గౌడ , మాల, గిరిజన సహకార కార్పొరేషన్ లకు డైరెక్టర్ల నియామకం జరిగింది.ఒక్కో కార్పొరేషన్ కు 15మంది చొప్పున 60 మంది మెంబర్ల నియామకం చేపట్టారు.ప్రతి కార్పొరేషన్ లో 12 మంది టీడీపీ, ఇద్దరు జనసేన, ఒక బిజెపి సభ్యునికి అవకాశం కల్పించారు. అందులో భాగంగా గుడ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజును రాష్ట్ర యాదవ కార్పొరేషన్ మెంబర్ గా నియమించారు. దీంతో పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ ప్రతిఫలం ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రస్తుత కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వాటి నుంచి తెలుగుదేశం పార్టీ గుడ్లూరు మండల అధ్యక్షులుగా జనిగర్ల నాగరాజు ఆయన వెంటే ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పిన ప్రతి పనిని చకచకా ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహిస్తూ ముందుకు సాగారు.. పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే ఒక అడుగు ముందుగానే జనిగర్ల నాగరాజు మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఇంటూరి నాగేశ్వరరావుని ఎమ్మెల్యేగా గెలిపించడంలోనూ నాగరాజు కృషి ఎనలేనిది. గుడ్లూరు మండలంలోనే కాక నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలతో పలుమార్లు సంప్రదింపులు జరిపి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేటట్లు చేయడంలో నాగరాజు సఫలీకృతం అయ్యారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భారీ మెజారిటీతో గెలవడం, ఎప్పుడూ రానంత మెజారిటీ నియోజవర్గంతో పాటు గుడ్లూరు మండలంలో రావటం జనిగర్ల నాగరాజు చేసిన కృషికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో నాగరాజు రాష్ట్ర ,జిల్లా స్థాయి నాయకుల మన్ననలు పొందారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పార్టీ అధిష్టానం చేపట్టడంతో కందుకూరు నియోజకవర్గం నుంచి జనిగర్ల నాగరాజుకు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రకటించిన నాలుగు కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ మెంబర్లుగా టిడిపి తరఫున 12 మంది మెంబెర్లను ప్రతిపాదించగా అందులో జనిగర్ల నాగరాజు ఒకరు. దీంతో గుడ్లూరు మండలం టిడిపి నాయకులతో పాటు, నియోజకవర్గ నాయకులు పలువురు జనిగర్ల నాగరాజుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనిగర్ల నాగరాజు అమరావతి జ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ అదృష్టం తలుపు తడుతూనే ఉంటుందని తనకు ఈ పదవి వరించినందుకు తన కెంతో గర్భంగా ఉందని అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, యువ నాయకులు నారా లోకేష్ కు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి జనిగర్ల నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.
Admin
Amaravathi Jyothi