Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : జనసేన+టీడీపీ+బీజేపీ పొత్తులో నెల్లూరు జిల్లా, కావలి టికెట్ జనసేన కే కావాలని కోరుతున్నాము....నాదెండ్ల మనోహర్ మంగళగిరి,అమరావతి జ్యోతి: జనసేన కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ కొంతమంది నాయకులతో కలిసి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసి కావలి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ నెల్లూరు జిల్లా మొత్తంలో కావలి టికెట్ కావాలని గట్టిగా కోరుతున్నానని ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో ఉంది కాబట్టి సమీకరణాలు మారబోతున్నాయి, సీట్ల సర్దుబాటు లో చాలా మార్పులు ఉండబోతున్నాయి కావున పొత్తులో ఏ ఏ పార్టీలు ఎక్కడెక్కడ పోటీచేసేదీ త్వరలో నిర్ణయిస్తాయి అని. కావున ఇప్పుడు సీట్లలో మార్పులు తప్పక ఉంటాయని అలానే కావలి అభ్యర్థిగా జనసేన పార్టీకే కావాలి అని గట్టిగా అడుగుతున్న సందర్భంలో అళహరి సుధాకర్ ను పరిగణలోకి తీసుకుంటామని సూచన ప్రాయంగా చెప్పడము జరిగింది. ఈ మధ్య కొంత మంది తనని కలిసినప్పుడు వారితో ప్రోటోకాల్ అనేది ఉంటుందని మీరు ఇంఛార్జి తోనే కలిసి పనిచేయాలని అప్పుడే వారికి గుర్తింపు వస్తుందని సూచించినట్లు తెలిపారు. అదే సందర్భoగ కావలి నియోజకవర్గం లో అత్యంత పెద్ద పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నందుకు అళహరి సుధాకర్ ను వారికి సహకరించిన నాయకులకు అభినందనలు తెలిపారు. నాదెండ్ల ను కలిసిన వారిలో కృష్ణయ్య, రుషికేశ్, సుధీర్, ఆలా శ్రీనాథ్, వేంకయ్య, అగస్టిన్, మురళి, శ్రీను, పాని, శ్రీకాంత్, సందీప్ తదితరులు హాజరయ్యారు.
Admin
Amaravathi Jyothi