Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే కోట్లాదిమంది బడుగుల జీవితాల్లో వెలుగులు: ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు, అమరావతి జ్యోతి: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు,అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతో పాటు పడ్డారని, ఆయన రచించిన రాజ్యాంగం కోట్లాదిమంది బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని నాగేశ్వరావు సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి నాగరాజు, నాయకులు చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, సవిడిబోయిన వెంకటకృష్ణ, మనికే మాల్యాద్రి, లింగాబత్తిని మాల్యాద్రి, దాసరి ప్రమోద్, మచ్చ మనోహర్, గుమ్మ శివ, షేక్ ఫిరోజ్, ఫాజిల్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi