Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అనివేటి మండప నిర్మాణానికి రూ. 50,116 విరాళం అందజేసిన దామా వెంకటేశ్వర్లు కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు గ్రామ దేవత ఆదిపరాశక్తి శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా ఐదు కోట్ల రూపాయలతో అమ్మవారి జీర్ణోదరణ కార్యక్రమం జరిగింది. అనివేటి మండప నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మండప నిర్మాణానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆదివారం దామా వెంకటేశ్వర్లు ధర్మపత్ని రమాదేవి రూ 50116/-లు విరాళాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.
Admin
Amaravathi Jyothi