Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బంపర్ మెజారిటీ తో కావ్య క్రిష్ణారెడ్డిని గెలిపించి అభివృద్ధికి బాట వేద్దాం.. ........*పిఏబిసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏబిఎం సంస్థల అధినేత జిడిడి దివాకర్* కావలి, అమరావతి జ్యోతి: - కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కావ్య కృష్ణారెడ్డి ని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కావలి అభివృద్ధి కి బాటలు వేద్దాం అని పిఏబిసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏబిఎం సంస్థల అధినేత జిడిడి దివాకర్ పిలుపునిచ్చారు. శనివారం కావ్య క్రిష్ణారెడ్డి దివాకర్ ని వారినివాసంలోమర్యాదపూర్వకంగా కలిశారు.కావ్య క్రిష్ణారెడ్డి గెలుపు కోసం తాను ఉపవాసం చేస్తున్నానని, దేవుని ప్రార్థిస్తున్నానని, ఆయన విజయం సాధించే వరకు ఉపవాసం కొనసాగుతుందని దివాకర్ తెలిపారు. కావ్య క్రిష్ణారెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. క్రిష్ణారెడ్డి విజయం కోసం పాస్టర్లు ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవ. కె. మూర్తి బాబు, జెఎం ఫ్రాంక్లిన్, పాస్టర్స్ ప్రెసిడెంట్ ఏసు బాబు, పాస్టర్స్ కన్వీనర్ పాడేటి థామస్, ఒంగోలు జగన్ డేవిడ్సన్, రెవ జయపాల్ అడ్వకేట్ శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులుతదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi