Monday, 27 July 2026 01:35:07 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జగన్ కు ఓటమి భయం మొదలయ్యింది

Date : 06 January 2024 08:08 AM Views : 254

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : జగన్ కు ఓటమి భయం మొదలైంది. -ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ట్రాన్స్ ఫర్లు ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు: చంద్రబాబు వ్యంగ్యం. కనిగిరిలో రా కదలిరా సభ -ఐదేళ్లుగా చేసిన పాపాలు జగన్ ని ఇప్పుడు వెంటాడుతున్నాయని వ్యాఖ్య. మంత్రులను, ఎమ్మెల్యేలను ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడని ఎద్దేవా. కనిగిరి, అమరావతి జ్యోతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదలి రా సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత ఐదేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని జగన్ లో భయం మొదలైందని. పేర్కొన్నారు. అందుకే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నాడని... మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ట్రాన్స్ ఫర్లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో చెత్తను తీసుకెళ్లి మరో నియోజకవర్గంలో పడేస్తున్నాడని, అలా చేసినంత మాత్రాన చెత్త కాస్తా బంగారం అవుతుందా తమ్ముళ్లూ...? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలా ట్రాన్స్ ఫర్లు ఉంటాయని తానెప్పుడూ వూహించలేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. "మీ ఇంట్లో చెత్తను ఎక్కడేస్తాం... చెత్త కుండీలో వేస్తాం. కానీ ఈ ముఖ్యమంత్రి చెత్తను తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో వేస్తాడంట! ఇక్కడి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడుగురు ఎమ్యెల్యేలు ఉన్నారు. ఇక్కడొక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు... బుర్రా మధుసూదన్. మధుసూదన్ కాదు... 'మనీ'సూదన్. అతడికి అన్నింట్లో వాటా కావాలి. అన్నింట్లో దోపిడీనే. అతడిని ఇంకా ఎందుకు మార్చలేదని అడుగుతున్నా. యర్రగొండపాలెంలో ఇంకొకాయన ఉన్నాడు... బట్టలిప్పేసి తిరుగుతుంటాడు. ఆయనొక మంత్రి. ఇప్పుడాయనకు ట్రాన్స్ ఫర్ వచ్చింది. తీసుకెళ్లి కొండేపిలో పడేశారు. యర్రగొండపాలెంలో చెత్త కొండేపిలో బంగారం అవుతుందా? మార్కాపురంలో మరొకాయన ఉన్నాడు... ఆయన ఒక సయీం, ఆయన తమ్ముడొక చోటా నయీం. ఈ పేర్లను స్థానికంగానే పిలుచుకుంటున్నారు. ఇంకొకాయన గిద్దలూరులో ఉన్నాడు.ఆయన నావల్ల కాదు, నేను పోటీ చేయను అని పారిపోయాడు. దర్శిలో మరొకాయన ఉన్నాడు. ఎక్కడి చూసినా వాటాలు కావాలి... ఇప్పుడాయనకు సీటే లేదు పొమ్మన్నాడు. ఒంగోలులో ఇంకొకరు ఉన్నారు. మొదట్లో జిల్లా అంతా నాదే, రాష్ట్రమంతా నాదే అన్నాడు. అతడు ఇప్పుడెక్కడున్నాడు. తమ్ముళ్లూ... అడ్రస్ గల్లంతైపోయింది. గతంలో కొండేపిలో ఒక అనామకుడ్ని పెట్టారు... ఇప్పుడాయన అడ్రస్ ఎక్కడుందో. మనందరం వెతుక్కోవాలి! ఇది రాజకీయమా? నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన తప్పులకు, ఎమ్మెల్యేలను బలిపశు వులను చేశారు" అని చంద్రబాబు ధ్వజమెత్తారు. పిట్టకథ చెప్పిన చంద్రబాబు ఓ గజదొంగ ఉంటాడు. కోర్టులో విచారణ మొత్తం పూర్తయ్యాక అతడికి ఉరిశిక్ష వేస్తారు. నీ చివరి కోరిక ఏమిటని జడ్జి అతడిని అడుగుతాడు. అప్పుడా తన తల్లిని పిలిపించమంటాడు. అతడి కోరిక ప్రకారమే తల్లిని పిలిపిస్తారు.. అక్కడికి వచ్చిన తల్లిని పట్టుకుని ఆ గజదొంగ గట్టిగా కొరుకుతాడు. దాంతో జడ్జి... అదేంటి, తల్లిని పట్టుకుని ఎందుకలా కొరికావు? అని ప్రశ్నిస్తాడు. అందుకా గజదొంగ బదులిస్తూ... తాను తప్పు చేసిన మొదటిరోజే చెంప మీద ఒక దెబ్బకొట్టి ఇది తప్పు అని చెప్పి ఉంటే ఇవాళ నేనిలా నేరస్తుడ్ని అయ్యేవాడ్ని కాదు అని చెబుతాడు. నేను తెచ్చిన దొంగడబ్బుకు ఆనందపడి పొగడడం మొదలుపెట్టింది. దాంతో నేను విచ్చలవిడిగా నేరాలు చేశాను. నా తప్పులన్నింటికీ తల్లే కారణం అన్నాడు. ఇదే విధంగా ఏపీలో ఎమ్మెల్యేలతో తప్పులు చేయించారు. వాటాల కోసం అవినీతి చేయించారు... అందరినీ ఇష్టానుసారం వాడుకున్నారు. నన్ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలంట!ఈ జిల్లాలోనే ఓ ఎమ్మెల్యేకు ఏం చెప్పారో చూడండి. నన్ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలంట. మమ్మల్ని తిడితేనే అతడికి టికెట్ ఇస్తారంట. ఎమ్మెల్యే సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా ఎంత సేవ చేశాం అని కాదు... చంద్రబాబును ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేశ్ ను ఎంత తిట్టావు, పవన్ కల్యాణ్ ను ఎంత తిట్టావు? అనే అంశాల ఆధారంగా టికెట్లు ఇస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. కానీ, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం... మాకు సంస్కారం ఉంది, మేం తిట్టం, నువ్వు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదు అని చెప్పారు. వాళ్లను నేను గట్టిగా అభినందిస్తున్నా. నా జీవితంలో ఆ ఒక్కరోజే బాధపడ్డాను!నన్ను, నా భార్యను అసెంబ్లీ సాక్షిగా తిట్టారు. అలా తిడితే వీళ్లు పెద్ద నాయకులు అయిపోతారా? ఎప్పుడూ బాధపడని నేను నా జీవితంలో ఆ ఒక్కరోజు బాధపడ్డాను. 23 క్లేమోర్ మైన్స్ పేలినా సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు నేను భయపడలేదు. ప్రజల కోసం మంచి చేస్తున్నప్పుడు కూడా భయమెందుకు? కానీ, జీవితంలో ఒక్కరోజు మాత్రం బాధపడ్డాను... నా భార్యను అసెంబ్లీలో తిట్టినందుకు బాధ కలిగింది. ఆ రోజే చెప్పాను... ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేను ఉండను అని స్పష్టం చేశాను. ఇది కౌరవ సభ... దీన్ని మళ్లీ గౌరవ సభ చేసిన తర్వాతే ఇక్కడ అడుగుపెడతానని శపథం చేసి వచ్చాను.. అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: