Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లింగసముద్రం : రాళ్లపాడు ప్రాజెక్టును ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం సందర్శించారు.కుడి కాలువ గేటు మరమ్మతులకు సంబంధించిన పలు అంశాల ఆయన ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాళ్లపాడు కుడికాలువ గేటు రెండు అడుగులకు పైగా లేచి ఉన్నదని, పూర్తిస్థాయిలో దీనికి మరమ్మత్తులు చేయడం జరుగుతుందని, ఇంజనీరింగ్ బాద్యులు తెలిపారు. నీరు యధావిధిగా రైతులకు అందిస్తామని వారు ఇంటూరి నాగేశ్వరరావుకి వివరించారు. నీటి సరఫరా విషయమై ఎమ్మెల్యే రైతులతో మాట్లాడారు.. రైతులకు పరిపూర్ణముగా నీటిని సరఫరా చేయడంలో రాజీ పడబోమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పారు రాళ్లపాడు కు సంబంధించిన మిగతా గేట్లుకు కూడా సర్వీసింగ్ త్వరితగతిన చేయాలని ఎమ్మెల్యే ఇంజనీర్లకు సూచించారు. నోట్ ఫోటో రైటప్1: రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఫోటో రైట్ అప్ 2: రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
Admin
Amaravathi Jyothi