Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తుఫాన్ ఉపశమన చర్యలు మిచౌంగ్ తుఫాన్ బాధితులకు ఆహారపొట్లాల పంపిణి.....సమీక్షించిన ఆర్డీఓ శీనానాయక్ కావలి, అమరావతి జ్యోతి : కావలి ఆర్డీఓ వి కె శీనానాయక్ ఆదేశాల మేరకు కావలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు తుఫాన్ ఉపశమన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ భవనంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసి రెస్క్యూ శిక్షణ పొందిన సోషల్ ఎమర్జెన్సీ రిలీఫ్ వాలంటీర్స్ బృందాలను అందుబాటులో ఉంచారు. ఈ బృందాలు రెవిన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలకు సహకరిస్తాయి. రామమూర్తిపేట పురపాలక ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ నిర్వాసితుల శిబిరంతో పాటు, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రాంతాలలో 200 ఆహారపొట్లాలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమాలను ఆర్డీఓ సోమవారం సమీక్షించారు. ఆయన సూచనల మేరకు అత్యవసర వైద్య బృందాన్ని కూడా సిద్దపరిచారు. ఈ కార్యక్రమాలలో కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్, కార్యదర్శి ప్రసన్నాంజనేయులు, కోశాధికారి కలికి శ్రీహరి రెడ్డి, హరినారాపరెడ్డి, సెర్వ్ బృంద సభ్యులు నయీమ్, రాజశేఖర్, బాలాజీ, సాయికుమార్, మున్సిపల్ డిఇ సాయిరాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబురావు, శాంతినగర్ వార్డ్ సచివాలయ కార్యదర్శి రమేష్, పరశు మురళి ,తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi