Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బి ఆర్ ఆక్స్ ఫర్డ్ లో రహదారి భద్రతపై అవగాహన సదస్సు పలు సూచనలు ఇచ్చిన అర్ టి ఓ రఫీ కందుకూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు ఉపరవాణా కమిషనరు బి చందర్ ఆదేశముల మేరకు గురువారం స్థానిక బి. ఆర్ ఆక్స్ ఫర్డ్ జూనియర్ కళాశాల నందు రహదారి భద్రతపై అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడమైనది. ఇందులో భాగంగా కందుకూరు మోటారు వాహనముల తనిఖీ అధికారి ఎస్ కె యండి రఫీ మాట్లాడుతూ విద్యార్థి దశనుండే ట్రాఫిక్ నియమ నిబంధనలగురించి అందరికి అవగాహన ఉండాలని, అదేవిధముగా రహదారి భద్రత గురించి అందరు తెలుసుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహితముగా వాహనములను నడుపవలెనని తెలియచేసారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవతా దృక్పదంతో తమవంతు సహాయము చేయాలని, ప్రతి ఒక్కరు రహదారి భద్రతలను పాటిస్తూ ప్రమాదముల బారినపడకుండా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మట్ ధరించి వాహనము నడుపవలెనని తెలియచేసారు. అదేవిధంగా వర్షాకాలం కావడం వలన వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉంటాయి కావునా ప్రతి ఒక్క వాహనదారునికి విజ్ఞప్తి ఏమనగా నీటి ప్రవాహము తగిన తరువాత మాత్రమే ప్రయాణము కొనసాగించవలెనని లేనిచో అనవసరముగా ప్రాణహాని జరుగునని అదేవిధముగా స్కూల్ మరియు కాలేజీ బస్సులు నడుపు డ్రైవర్లు జాగురతతో వాహనమును నడిపి స్కూల్ మరియు కాలేజీ విద్యార్థిని విద్యార్థులను వారి వారి గమ్యస్థానములకు సురక్షితంగా చేర్చవలెనని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో రహదారి భద్రత పట్ల కూడా అవగాహన అంతే ముఖ్యమని, మనము వాహనమును నడుపునపుడు మన భద్రత ఎంత ముఖ్యమో అదేవిధముగా ఎదుటివారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదములు జరుగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాద రహితంగా వాహనములు నడుపవలెనని తెలియచేసారు.
Admin
Amaravathi Jyothi