Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా గెలిచిన తర్వాత తొలిసారి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.. పట్టణ మరియు గ్రామ పార్టీ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మరియు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని సత్కరించారు..ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగిర్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర పార్లమెంట్ మరియు నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు గ్రామ, పట్టణ వార్డు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi