Monday, 20 April 2026 05:33:39 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటు

Date : 07 January 2024 10:08 PM Views : 316

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె పైన ఎస్మా ప్రయోగించడం సిగ్గు చేటు. ఉలవపాడు, అమరావతి జ్యోతి: గత 27 రోజులుగా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా సమ్మె చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ను విడుదల చేస్తూ సమ్మె పైన ఎస్మా ను ప్రయోగించడం సిగ్గుచేటని సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షులు వాకా.లాతా రెడ్డి పేర్కొన్నారు. 27వ రోజులో భాగంగా ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శిబిరం ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం నాడు తహాసిల్దార్ ఆఫీస్ వద్ద జీవో నెంబర్-2 ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా లతా రెడ్డి మాట్లాడుతూ 26 రోజుల తర్వాత ప్రభుత్వానికి అత్యవసర సేవలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు ప్రభుత్వం ఉత్తర్వులకు గాని,ఎస్మా కు గాని అదిరేది బెదిరేది భయపడేది లేదని తేల్చి చెప్పారు. పోరాటం ఆగదని, కొనసాగుతుందని పేర్కొన్నారు. జీవో నెంబర్ 2 వర్కర్లైన అంగన్వాడీలకు వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం అంగన్వాడీల పోరాటం చేస్తుంటే చర్చల ద్వారా పరిష్కరించాలని, పట్టుదలకు పోయి ఎస్మా ను ప్రయోగిస్తే నష్టపోయేది ప్రభుత్వమేనని అంగన్వాడీలు కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెను పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎ.పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఉలవపాడు సెక్టార్ లీడర్లు సిహెచ్ పద్మ, సిహెచ్ పద్మజ, అంగన్వాడి నాయకులు జే వసంత, శ్రీదేవి, ఎస్ కే సుల్తాన్ బీ, కుమారి, హేమ,బీ.వరలక్ష్మి, శైలజ, మనీషా తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :