Friday, 11 September 2026 08:48:49 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కందుకూరు టిడిపిలోకి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు

Date : 28 April 2024 06:12 PM Views : 920

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తరలుదాము రండి మనం, తెలుగుదేశం వైపు.... *కందుకూరు టిడిపిలోకి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు* *ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో భారీ చేరికలు* కందుకూరు, అమరావతి జ్యోతి: ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. అన్ని గ్రామాలనుంచి, అన్ని వర్గాల ప్రజలు.. జగన్ పాలన పై తీవ్ర అసంతృప్తితో, టిడిపిపై నమ్మకంతో.. అదే సందర్భంలో ఇంటూరి నాగేశ్వరావు ఇస్తున్న భరోసాతో పసుపు జెండా నీడకు కదులుతున్నారు. ఆదివారం కందుకూరులోని పార్టీ కార్యాలయంలో, పలు గ్రామాల వైసీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి *ఇంటూరి నాగేశ్వరరావు* సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. *పందలపాడు నుంచి...* గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నేత కంజుల వెంకటరామిరెడ్డితోపాటు ఆయన ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం గూటికి చేరారు.. మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు కూనం సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు గుళ్లా శ్రీనివాసులు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల వెంకట రమణయ్య, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకట సుబ్బారావు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రావెళ్ల వెంకటేశ్వర్లు, రావుల రవి, బైరపనేని రమణయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు దేవా తదితరులు పాల్గొన్నారు. *పల్లెపాలెం నుంచి...* ఉలవపాడు మండలం, పెద్దపట్టపుపాలెం పంచాయతీ పల్లెపాలెం గ్రామానికి చెందిన వెయ్యాల అశోక్, గ్రామకాపు వెయ్యాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో.... అప్పాడి వెంకటేశ్వర్లు, పొన్నాడి వెంకటేశ్వర్లు, పొన్నాడి బ్రహ్మయ్య, నాగేశ్వరరావు, చింతా చిన్న వెంకటేశ్వర్లు, అయిల శేషయ్య, వెంకటేశ్వర్లు, ఇంకా పలు కుటుంబాల వారు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. *చాకిచెర్ల నుంచి....* ఉలవపాడు మండలం చాకిచెర్ల పంచాయతీ నేత సుదర్శి సాంబయ్య ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పార్టీలో చేరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు మిరియం మల్లికార్జున, ఎందోటి శ్రీను, సుదర్శి శ్రీను, మిరియం భాస్కర్, నాయకులు తాటితోటి రవి, కేశవులు, మట్టెపు రామకృష్ణయ్య, సుదర్శి కళ్యాణ్, సుబ్బారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. *రాళ్లపాడు నుంచి...* లింగసముద్రం మండలం పెంట్రాల పంచాయతీలోని రాళ్లపాడు గ్రామానికి చెందిన 10 ఎస్సీ కుటుంబాల వారు నాగేశ్వరావు సమక్షంలో పార్టీలో చేరారు. గ్రామ నాయకుడు గొల్లపల్లి వెంకటేశ్వర్లు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాళ్లూరి ముసలయ్య, బోడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: