Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరులో మహిళా శంఖారావం ఇంటూరి సౌజన్య ఆధ్వర్యంలో ఇంటింటి తలుపు తడుతున్న తెలుగు మహిళలు కందుకూరు, అమరావతి జ్యోతి: ఈ ఐదేళ్లలో నష్టపోయింది చాలు.. ఇకనైనా మేల్కొందాం. మన తలరాతను మనమే మార్చుకుందాం. జగన్మోహన్ రెడ్డిని సాగనంపుదాం. తెలుగుదేశం పాలనను తెచ్చుకుందాం*... అంటూ, మహిళలంతా సైన్యంలా ముందడుగు వేస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ, ఆయన శ్రీమతి సౌజన్య చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఆదివారం 14వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలోని రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలతో కూడిన కరపత్రాలను పంచారు. *బాగున్నారా అక్కయ్యా ! ఏం చదువుతున్నావు చెల్లెమ్మా ! ఆరోగ్యం బాగుందా అమ్మమ్మా* ... అంటూ వారి కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయి సౌజన్య పలకరిస్తున్న తీరుకు ప్రతి ఒక్కరూ ముగ్దులై ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏమి నష్టం జరుగుతుందో అంశాల వారీగా, అంకెలతో సహా సౌజన్య వివరిస్తున్నప్పుడు మహిళలు శ్రద్ధతో వింటున్నారు. అలాగే రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో అమలు చేయబోయే పథకాలు గురించి లోతుగా వివరిస్తూ స్థానికులను ఆకట్టుకుంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో *శ్రీరాంనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 50లక్షల రూపాయలు కేటాయించి శంకుస్థాపన కూడా చేస్తే* .... వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టిన విషయాన్ని స్థానికులు సౌజన్యకి తెలపగా... *రాబోయే ప్రభుత్వంలో ఆ నిర్మాణాన్ని మనమే మొదలుపెట్టి పూర్తిచేద్దామని* ఈ సందర్భంగా ఆమె హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఇంటూరి నాగేశ్వరరావుని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు గుమ్మడి బ్రహ్మయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, మాజీ వార్డు కౌన్సిలర్ ముచ్చు వరమ్మ, వార్డు మహిళ నాయకులు, పట్టణ మహిళ నాయకులు గుమ్మడి మాల్యాద్రి, బూసి రాజు, చెంచు కృష్ణ, యల్లంటి మాల్యాద్రి, యనమల కనకరాజు, పెద్దకత్తుల రవి, పిరతల బాలాజీ, దార్ల శీను, గెంటినపల్లి ప్రసాదు, చరణ్ తేజ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...
Admin
Amaravathi Jyothi