Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *కడియం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా స్టాలిన్.* కడియం, అమరావతి జ్యోతి : కడియం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా యాదల సతీష్ చంద్ర స్టాలిన్ తిరిగి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాలకవర్గాలను పార్టీ అధిష్టానం మేరకు నియమించారు. చందన అధ్యక్షతన పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మరోసారి కడియం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా ఎంపికైన యాదల సతీష్ చంద్ర స్టాలిన్, జేసిఎస్ కన్వీనర్లు తడాల చక్రవర్తి, తాటికొండ విష్ణుమూర్తిలు వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. మండల యువజన విభాగం అధ్యక్షులుగా రత్నం శ్రీకృష్ణ, మండల మహిళా విభాగం అధ్యక్షులుగా ఊటుకూరి శైలజ, మండల రైతు విభాగం అధ్యక్షులుగా ఉద్దండ సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బట్టు చిన్ని, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షులుగా మన్నుపాటి కృష్ణ, ప్రచార విభాగం అధ్యక్షులుగా ఎల్లె వీర్రాజు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా తోకల శ్రీనివాసరావు, సేవాదళ్ విభాగం అధ్యక్షులుగా సాపిరెడ్డి కామేష్, చేనేత విభాగం అధ్యక్షులుగా పిచ్చుక బసవరాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా సర్కార్ భాష నియమితులయ్యారు. ఎంపికైన పాలకవర్గ సభ్యులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.
Admin
Amaravathi Jyothi