Thursday, 11 June 2026 10:06:34 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తెలుగుదేశం పార్టీలో చేరిన 10 ముస్లిం కుటుంబాలు

Date : 29 December 2023 09:45 PM Views : 241

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తెలుగుదేశం పార్టీలో చేరిన 10 ముస్లిం కుటుంబాలు కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వలసల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన, స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక అనేకమంది వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంటూరి నాగేశ్వరరావు ఇస్తున్న భరోసాతో తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. కందుకూరు పట్టణంలో ఇప్పటికే ముస్లిం కుటుంబాలు భారీ సంఖ్యలో ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో టిడిపిలో చేరగా, ఇప్పుడు ఉలవపాడు మండలం నుంచి చేరికలు మొదలయ్యాయి. శుక్రవారం ఉలవపాడు గ్రామానికి చెందిన 10 ముస్లిం కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఇంటూరి నాగేశ్వరరావు వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఉలవపాడుకు చెందిన షేక్ బాబు ఆధ్వర్యంలో షేక్ రఫీ, షేక్ ఖాజాహుస్సేన్, షేక్ అహమ్మద్, షేక్ ఖాదర్ బాషా, షేక్ సుల్తాన్ బాషా, షేక్ షాబు, షేక్ సుల్తాన్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ సుభాని కుటుంబాలు టిడిపిలో చేరారు. అయితే వారంతా కుటుంబాలతో సహా వచ్చిమరీ నాగేశ్వరరావుకి మద్దతు తెలపటం విశేషం. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుకున్న మైనారిటీలు, జగన్ ప్రభుత్వం వచ్చాక ఏమేమి కోల్పోయామో గుర్తించారని అన్నారు. అప్పట్లో కార్పొరేషన్ రుణాలు, విదేశీవిద్య, దుల్హన్, రంజాన్ తోఫా లాంటి పథకాల ద్వారా మేలు జరిగిందని చెప్పారు. ఎన్నికలకు ముందు మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, గద్దెనెక్కాక పట్టించుకోకపోవడంతోనే మైనార్టీలు వైసీపీని వదిలి బయటకు వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారు, రాబోయే ఎన్నికల్లో కందుకూరులో పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని, రాబోయే మన ప్రభుత్వంలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు పార్టీ నాయకులు షేక్ కరీం, షేక్ ఖాదర్, షేక్ బాజీ, బొడ్డు ప్రసాద్, పోలుబోయిన శ్రీనివాసులు, రాచగర్ల శివకుమార్, కొప్పోలు రవితో పాటు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :