Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : క్రికెట్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసిన ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు అమరావతి జ్యోతి: ఉలవపాడు మండలం భీమవరం గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగగా. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కందుకూరు ఇమ్ము లెవెల్స్ మరియు భీమవరం లెవెల్స్ జట్లు తలపడగా ఇమ్ము లేవన్స్ జట్టు విజేతగా నిలిచింది.. ఈ కార్యక్రమానికి టోర్నమెంట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విజేతగా నిలిచిన కందుకూరుకు చెందిన ఇమ్ము లెవెల్స్ జట్టుకు మరియు రన్నర్ గా నిలిచిన భీమవరం లెవెల్స్ జట్లకు ట్రోఫీ తో పాటు క్యాష్ నగదు అందజేయడం జరిగినది.... విజేతగా గెలిచిన జట్టుకు 25 వేల రూపాయలు, మరియు రన్నర్ గా నిలిచిన జట్టుకు 15వేల రూపాయలు ను ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా ప్రోత్సాహంగా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భీమవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు జాజుల రవి, నిర్వాహకులు సి.హెచ్ శ్రీనివాసులు, వెంకటరామరాజు, శ్రీనివాసులు మరియు ఇతరులు పాల్గొన్నారు....
Admin
Amaravathi Jyothi