Friday, 17 April 2026 03:14:36 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు

బహుమతులు అందజేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు

Date : 16 January 2026 10:59 PM Views : 199

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ఉలవపాడు:తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలలో విశేషంగా ఆకట్టుకున్నాయి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. పండుగ సంబరాల్లో భాగంగా కరేడులో ముగ్గుల పోటీలు నిర్వహించగా, 300 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఆయన సతీమణి సౌజన్య కుమారులు అవినాష్, సందీప్ పాల్గొని ప్రతి ముగ్గును పరిశీలించి, మహిళలను పేరుపేరునా పలకరిస్తూ అభినందించారు. వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు జరగడంతో కరేడు గ్రామం కళకళలాడింది. కిలోమీటర్ల పొడవునా రంగురంగుల ముగ్గులను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఉలవపాడు మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అశేషంగా ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. *బహుమతులు అందించిన ఎమ్మెల్యే దంపతులు* ముందుగా కరేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు దంపతులకు గ్రామస్తులు ఆత్మీయంగా ఘనస్వాగతం పలికారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే దంపతులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలను నిర్ణయించేందుకు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు జడ్జిలుగా వ్యవహరించారు. అనంతరం ముగ్గురు విజేతలను ఎంపిక చేసి ఎమ్మెల్యే దంపతులు చేతుల మీదుగా వారికి బహుమతులు అందించారు. వాక గ్రామానికి చెందిన పొడమేకల సుకన్య కు వాషింగ్ మిషన్, కరేడు గ్రామానికి చెందిన ఆరివేణి సుజాతకు ఫ్రిజ్, పెల్లేటి నీలిమకు టీవీ బహుకరించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళను అభినందిస్తూ, ప్రోత్సాహకంగా చీర అందజేశారు. రాత్రికి తెలుగుదేశం పార్టీ నాయకుడు పొడపాటి సుధాకర్ ఆధ్వర్యంలో పండు ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అదరహో అనిపించింది. డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న యువత కేరింతలు, ఈలలతో హుషారెత్తించారు.ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల టిడిపి అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు, కరేడు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆదాము కరేడు గ్రామ తెలుగు యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :